ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు - చోడవరం అక్రమ గ్రావెల్ తవ్వకాలు న్యూస్

ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు లేని సమయాన్ని అదనుగా చేసుకొని... విశాఖ జిల్లా చీడికాడలో గ్రావెల్ దందా కొనసాగిస్తున్నారు.

illegally gravel digging
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు

By

Published : Sep 14, 2020, 4:11 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలంలో పెద్ద ఎత్తున గ్రావెల్ దందా సాగుతోంది. చీడికాడ-మంచాల మార్గంలోని మెట్ట దిగువన పొక్లెయిన్​తో తవ్వి.. నిరంతరం పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో గ్రావెల్ దర్జాగా తరలిస్తున్నారు. శని, ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలు కావటంతో అక్రమార్కులు గ్రావెల్​ను పొక్లెయిన్​తో తవ్వి.. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.

రెండు రోజులుగా గ్రావెల్​ను తవ్వుతున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆరోపించారు. మంచాల మార్గంలోని మెట్ల వద్ద అడవి అగ్రహారం, బైలపూడి ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో గ్రావెల్​ను తవ్వుతున్నట్లు వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:వర్షం కురవాలని లక్కవరంలో పూజలు

ABOUT THE AUTHOR

...view details