విశాఖ ఏజెన్సీ పెదవలస నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న బాణసంచాను... కొత్తకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీపావళి పండగ వస్తుండటంతో... విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన పెదవలస నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తారాజువ్వలు, టపాసులు, మందుగుండును ఆటోలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తకోట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... బాణసంచా తరలిస్తున్న ఆటోను పట్టుబడింది. ఆటో డ్రైవర్ పోలీసులను దాటుకుని వేగంగా వెళ్లే ప్రయత్నం చేయగా... వెంబడించి పట్టుకున్నారు. ఆటోలో నింపిన మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుని... పెదవలస ప్రాంతానికి చెందిన వృత్తుల శ్రీనివాస్, అప్పలనాయుడు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కొత్తకోట ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న బాణసంచా పట్టివేత... ఇద్దరి అరెస్ట్ - పెదవలసలో అక్రమంగా తరలిస్తున్న బాణాసంచాల పట్టివేత
విశాఖ ఏజెన్సీ పెదవలస నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న బాణసంచాను... కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా తారాజువ్వలు, టపాసులు, మందుగుండును ఆటోలో తరలిస్తుండగా... పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న బాణాసంచాల పట్టివేత... ఇద్దరి అరెస్ట్
TAGGED:
బాణాసంచాల పట్టివేత వార్తలు