విశాఖలో ఆక్సిజన్ సిలిండర్ల విక్రయ దందాను అధికారులు ఛేదించారు. బ్లాక్ మార్కెట్‌లో ఆక్సిజన్ సిలిండర్ల విక్రయంపై జగదీష్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడ్ని విశాఖ ఔషధ నియంత్రణ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ నిల్వల గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ యథేచ్ఛగా అక్రమాలు..
ఉక్కు నగరంలోని ఎంవీపీ కాలనీలో మెరే స్మార్ట్ సొల్యూషన్స్ వద్ద ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌పై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు జగదీష్ గుట్టు రట్టు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సిలిండర్ల నిల్వ, విక్రయం చేస్తున్న తీరును గుర్తించి కేసు నమోదు చేశారు.
రూ.78 వేలకు ఒకే..
డ్రగ్ ఇన్స్పెక్టర్ సదరు జగదీష్‌కు ఫోన్ చేసి తమకు ఆక్సిజన్ సిలిండర్లు కావాలని కోరగా తొలుత రూ. 55 వేలకు బేరం కుదిరింది. సాయంత్రం సిలిండర్లను వెనక్కి ఇస్తామని చెప్పగా ధర రూ. 78 వేలకు చేరుతుందని జగదీశ్ చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులతో కలసి డ్రగ్ ఇన్స్పెక్టర్ రూ. 50 వేల నగదు చెల్లించారు. మిగతా రూ. 28 వేలను ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సిందిగా జగదీశ్ కోరినట్లు వెల్లడించారు.
మొత్తం పది సిలిండర్లు స్వాధీనం..
ఈ క్రమంలో లైసెన్స్ లేకుండా సిలిండర్లను నిల్వ ఉంచడం, అనంతరం వాటిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి నుంచి మొత్తం పది సిలిండర్లను స్వాధీనం చేసుకున్నమన్నారు. 68 లీటర్ల సామర్ధ్యంతో పది, 48 లీటర్ల సామర్ధ్యం గల మరో రెండు సిలిండర్లను సీజ్ చేశామని ఔషధ నియంత్రణ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుడ్ని ఎంవీపీ పోలీసులకు అప్పగించినట్టు వివరించారు.
ఇవీ చూడండి:
అర్హులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ.. నేడు తెదేపా రాష్ట్ర వ్యాప్త నిరసన