విశాఖలో నిన్న అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో వెండి, నగదు లభ్యమైంది. తాటిచెట్లపాలెం జాతీయ రహదారి వద్ద పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. ఓ బస్సులో ఇద్దరు వ్యక్తులు 18 కిలోల వెండి, 2 లక్షల నగదుతో రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు.
తాటిచెట్లపాలెంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు.. వెండి, నగదు స్వాధీనం - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లాలోని తాటిచెట్లపాలెం జాతీయ రహదారి వద్ద పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రైవేటు బస్సులో ఇద్దరు ప్రయాణికుల వద్జ వెండి, నగదును గుర్తించారు.
![తాటిచెట్లపాలెంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు.. వెండి, నగదు స్వాధీనం Illegal Silver](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10607312-753-10607312-1613192556537.jpg)
Illegal Silver