ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా... పట్టించుకోని అధికారులు - Illegal sand mining news

బొడ్డేరు నదిలో భారీ ఎత్తున అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. డిమాండును ఆసరాగా చేసుకుని అక్రమార్కులు నదిలో ఇసుక తవ్వి... ఇతర ప్రాంతాలకు దర్జాగా తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

Illegal sand mining in the Boderu River
Illegal sand mining in the Boderu River

By

Published : May 16, 2021, 9:32 AM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం బొడ్డేరు నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. బొడ్డేరు నదిలోని మర్లగుమ్మి ఆనకట్టు సమీపంలో ఇసుక నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అసలే కరోనా సమయం కావటంతో... అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేదు.

ఇదే అదునుగా తీసుకొని... అక్రమార్కులు నదిలో ఇసుక తవ్వకాలకు తెర తీశారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా లారీలు, ట్రాక్టర్లపై పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తున్నారని.. పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details