విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని పిసిరిమామిడి వంతెన వద్ద ఓ వ్యాను బురదలో చిక్కుకుంది. వాహనాన్ని బయటకు తీసేందుకు వెళ్లిన చెరుకుంపాకలు, పిసిరిమామిడి గ్రామస్థులు వ్యాన్లో రేషన్ బియ్యం ఉండటాన్ని గమనించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. చింతపల్లి ఆర్ఐ బాలరాజు దొర, వీఆర్వో తులసీ తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - vizag crime news
విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు... బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత