విశాఖ జిల్లా మాడుగుల, చీడికాడ మండలాల్లో సారా తరలిస్తున్న నలుగురు వ్యక్తుల్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గొటివాడ, కృష్ణపాలెం, ఎం. గదబూరు, ఎస్.గదబూరు గ్రామాల్లో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని సీఐ జగదీశ్వరరావు చెప్పారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాడుగుల, చీడికాడ మండలాల్లోని 55 మందిపై బైండోవర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.