ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు రోజులు... 28 కేసులు... 29 మంది అరెస్ట్ - విశాఖలో మద్యం అక్రమ అమ్మకాల వార్తలు

విశాఖ పట్టణ పోలీసులు 2 రోజుల్లో భారీగా అక్రమంగా విక్రయిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 28 కేసులు నమోదు చేసి.. 29 మందిని అదుపులోకి తీసుకున్నారు.

illegal liquor seized by vizag police
విశాఖలో అక్రమ మద్యం పట్టివేత

By

Published : Jun 29, 2020, 10:51 AM IST

విశాఖ పట్టణ పోలీసులు మద్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 2 రోజుల వ్యవధిలో భారీగా మద్యం పట్టుకున్నారు. 28 కేసులు నమోదు చేసి 29 మందిని అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి 579 మద్యం సీసాలు, 5 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో సీజ్​ చేశారు. అలాగే టాస్క్​ఫోర్స్ పోలీసులు 2 వేర్వేరు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 27 మద్యం సీసాలు, వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details