ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత.. భార్యాభర్తలు అరెస్ట్ - illegal wine caught

గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యాన్ని నిల్వ ఉంచిన భార్యాభర్తలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

illegal liquor caught by police
అక్రమ మద్యం పట్టివేత

By

Published : Aug 11, 2020, 9:25 PM IST

విశాఖ జిల్లా తగరపువలసలో అక్రమంగా నిల్వ ఉంచిన 1086 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యాన్ని నిల్వ ఉంచిన భార్యాభర్తలైన చోడి వెంకటరావు, చోడి శ్రీదేవిలను భీమిలి సీఐ జి. శ్రీనివాస్​ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ స్క్రాప్​ దుకాణంలో అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details