ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంగురాళ్ల కోసం అక్రమార్కుల తవ్వకాలు.. చర్యలు చేపట్టిన అధికారులు - Excavations for colored stones in the Ananthagiri Zone

అక్రమార్కులు రంగురాళ్ల కోసం అర్ధరాత్రి సమయంలో తవ్వకాలు జరుపుతున్నారు. విశాఖ జిల్లా అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు గుర్తించారు.

Illegal excavations
అక్రమార్కుల తవ్వకాలు

By

Published : Jul 13, 2021, 12:19 PM IST

విశాఖ జిల్లా అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండలం బొర్రాలో అక్రమార్కులు రంగురాళ్ల తవ్వకాలు జరుపుతున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో బొర్రా రైల్వే స్టేషన్ స్టేషన్ పరిసర ప్రదేశాల్లో తవ్వకాలకు పాల్పడుతున్నారు. లక్షల విలువైన రంగు రాళ్లు దొరుకుతాయి.. అన్న ఉద్దేశంతో రాత్రివేళలో దందా కానిచ్చేస్తున్నారు.

ఆ ప్రదేశాన్ని అరకులోయ సీఐ దేవుడు బాబు, అనంతగిరి ఎస్ఐ రాము పరిశీలించారు. ఘటనపై వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానికులను విచారణ చేశారు. అనుమతులు లేకుండా రంగురాళ్ల తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details