ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మామిడితోటలో అక్రమ మద్యం.. రూ.8 లక్షల సరుకు స్వాధీనం - రెడ్డిపల్లిలో అక్రమ మద్య పట్టివేత

విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలోని ఓ మామిడి తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం డంప్​ను ఆబ్కారీ అధికారులు సీజ్‌ చేశారు. 7,680 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Illegal alcohol confiscation
రూ.8 లక్షల మద్యం స్వాధీనం

By

Published : Jan 24, 2021, 8:25 AM IST

విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో అక్రమంగా నిల్వచేసిన 7,680 మద్యం సీసాలను ఆబ్కారీ అధికారులు సీజ్‌ చేశారు. మద్యం నిల్వలపై అందిన సమాచారంతో దాడి చేసినట్టు భీమిలి ఎక్సైజ్‌ స్టేషనులో గాజువాక ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ కృష్ణకుమారి వెల్లడించారు.

వీటిని నిల్వచేసిన రెడ్డిపల్లి అప్పల సూర్యప్రకాశరావు అనే వ్యక్తిని అరెస్ట్‌చేసి వాహనాన్ని సీజ్‌చేశామన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పరారీలో ఉన్న కొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నామని.. పట్టుబడ్డ మద్యం విలువ రూ.8 లక్షలు ఉంటుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details