ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మావోయిస్టులకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు' - pedabayalu latest news

మావోయిస్టులకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని విశాఖ జిల్లా పెదబయలు పోలీసులు హెచ్చరించారు. గిరిజనులను అడ్డం పెట్టుకుని మావోయిస్టులు దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

pedabayalu
పెదబయలలో ప్రజలను హెచ్చరిస్తున్న పోలీసులు

By

Published : Nov 5, 2020, 11:06 AM IST

విశాఖ జిల్లా పెదబయలులో మావోయిస్టులకు ఎవరు సహకరించినా అరెస్టులు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. రెండు రోజుల కిందట పోలీసులకు వ్యతిరేకంగా ఇంజరి గ్రామస్థులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. ప్రజలు పోలీసులతో మమేకమవటాన్ని సహించలేని మావోలు గిరిజనులను అడ్డుపెట్టుకుని తప్పుడు పనులకు పాల్పడుతున్నారని అన్నారు.

కూబింగ్​లో ఉన్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అక్కడ మావోలకు సంబంధించి కీలక పత్రాలు లభించాయి. పోలీసుల నుంచి తప్పించుకుని మావోయిస్టులు కండ్రుం గ్రామంలో తలదాచుకున్నారు. పోలీసులు ఎంతో గౌరవంగా గ్రామస్థులతో మాట్లాడం విని..ప్రజలను మాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు.చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరంగా శిక్షించాల్సి వస్తుంది -పెదబయలు ఎస్సై రాజారావు

ABOUT THE AUTHOR

...view details