ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీమరిడిమాంబ ఆలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ట - అనకాపల్లి ఎంపీ తాజా వార్తలు

కూసర్లపూడిలోని శ్రీమరిడిమాంబ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా అనకాపల్లి ఎంపీ సత్యవతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని సమారు రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించారు.

idol prestige happened in kusarlapudi sri maridimamba temple in visakha district
కూసర్లపూడిలో నూతనంగా నిర్మించిన శ్రీ మరిడిమాంబ ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ

By

Published : Aug 5, 2020, 6:08 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడిలో నూతనంగా నిర్మించిన శ్రీ మరిడిమాంబ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక నాయకులు మడ్డు అప్పలనాయుడు సారథ్యంలో సుమారు రూ. 20 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సత్యవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్టలో పాల్గొని సతీ సమేతంగా పూజలు చేయించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details