ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశాఖ సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని యోచన ప్రీతి.. కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ ఏడాది మార్చ్ లో జరిగిన పదో తరగతి ఐసీఎస్ఈ విభాగంలో ఈ బాలిక 600 మార్కులకు గాను 582 అంటే 97% మార్కులు సాధించి పాఠశాల గత రికార్డులను తిరగరాసింది.
127 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల చరిత్రలో యోచన తనకంటూ ఓ పేజీని సృష్టించుకుంది. బాలిక తండ్రి జీ.వి. మహేష్ కుమార్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగి. ఆయన కుమార్త ఘనతపై.. పోర్ట్ డెప్యూటీ చైర్మన్ పీ.ఎల్.హరనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. మరింత ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. స్కూల్ యాజమాన్యం యోచనను అభినందించింది.