ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ నేవల్ డాక్​ యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్​గా ఐబీ ఉత్తయ్య.. - ఐబీ ఉత్తయ్య వార్తలు

విశాఖ నేవల్ డాక్​ యార్డ్ అడ్మిరల్ సూపరెండెంట్​గా ఐబీ ఉత్తయ్య బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్న రియర్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్​కి వైస్ అడ్మిరల్​గా పదోన్నతి లభించింది. 1987లో నౌకదళంలో కమిషన్​ అధికారిగా చేరిన ఉత్తయ్య.. 33 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు.

Visakhapatnam Naval Dockyard
విశాఖ నేవల్ డాక్​ యార్డ్ అడ్మిరల్ సూపరెండెంట్​గా ఐబీ ఉత్తయ్య బాధ్యతలు

By

Published : May 31, 2021, 7:15 PM IST

విశాఖ నేవల్ డాక్ యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్​గా రియర్ అడ్మిరల్ ఐబీ ఉత్తయ్య బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్న రియర్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్​కి వైస్ అడ్మిరల్​గా పదోన్నతి లభించింది. విశాఖలోని డైరక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్​కు బదిలీ అయ్యారు. రియర్ అడ్మిరల్ ఉత్తయ్య.. 1987లో నౌకాదళంలో కమిషన్ అధికారిగా చేరారు. 33 ఏళ్ల పాటు నేవీలో వివిధ హోదాలలో సేవలందించి పలు కీలక ఆపరేషన్లలో భాగస్వామి అయ్యారు. వార్ షిప్ డిజైన్ డైరక్టరేట్, ట్రైనింగ్ అకాడమీలు, నేవల్ డాక్ యార్డులు, నేవల్ హెడ్ క్వార్టర్స్​లలో బాధ్యతలు నిర్వర్తించారు. రియర్ అడ్మిరల్ ర్యాంకు పొందిన తర్వాత ఆయన హెడ్ క్వార్టర్స్​లో అదనపు డైరక్టర్ జనరల్ (టెక్నికల్) గా సేవలందిచారు. నేవల్ వార్ కాలేజీ పూర్వ విద్యార్దిగా విశిష్ట సేవా మెడల్​ను సాధించిన ఉత్తయ్య... భారత్ - రష్యా యుద్ద నౌకల తయారీ ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించారు.

ABOUT THE AUTHOR

...view details