విశాఖ జిల్లాలో దారుణం.. భార్యను కాల్చి చంపిన భర్త - vishaka crime news
22:19 July 04
భార్యను కాల్చి చంపిన భర్త
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త డీజిల్ పోసి నిప్పంటించడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన అరకులోయ మడంల గన్నెల పంచాయతీ కుందేలుగుడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ దేముడు బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కుదేలుగుడ్డి గ్రామానికి చెందిన కొర్రా గున్నమ్మపై ఆమె భర్త లవకుశ అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టిన భర్త.. అనంతరం డీజిల్ పోసి నిప్పు పెట్టాడు. చాలా వరకు కాలిపోయిన ఆమెను 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
Kishan Reddy: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు