తమ కుమార్తెను లక్మణ్ కుటుంబ సభ్యులు పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేశారని ఆరోపిస్తూ రామలక్ష్మి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ఇరుగు పొరుగు వారు యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి అండగా నిలిచారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. లక్ష్మణ్ కు వివాహేతర సంబంధం ఉందని ఆ కారణంతోనే కుటుంబ సభ్యుల సహకారంతో రామలక్ష్మిని అడ్డు తొలగించుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని రామలక్ష్మి తల్లిదండ్రులు కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం కొవ్వొత్తులు పట్టుకుని అల్లిపురం నుంచి ఎల్ఐసీ భవనం అంబేడ్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
జస్టిస్ ఫర్ రామలక్ష్మీ: భర్త చేతిలో దారుణంగా హత్య! - విశాఖలో భర్త చేతిలో భార్య హత్య న్యూస్
భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన మహిళ కుటుంబానికి విశాఖలో పౌర సమాజం అండగా నిలిచింది. బండి రామలక్ష్మి అనే మహిళ ఈ నెల 20న అగనంపూడిలో మరణించింది. భర్త సమాచారం మేరకు తొలుత ఆత్మహత్యగా భావించినా రామలక్ష్మి తల్లిదండ్రుల అనుమానంతో అసలు వాస్తవం బయటకు వచ్చింది. రామలక్ష్మి భర్త సంజయ్ ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు.
husband killed wife in vishakapatnam