ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: పుట్టింట్లో ఉన్న భార్యను.. కిరాతకంగా హతమార్చిన భర్త - visakha district crime news

కలకాలం తోడుగా ఉంటానని మూడుముళ్లు వేసినప్పుడు మాటిచ్చాడు. ఎలాంటి కష్టమెదురైనా తన చేతిని విడవనన్నాడు. అలా పెళ్లైన కొంతకాలం అన్యోన్యంగా గడిచింది వారి దాంపత్య జీవితం. ఈ క్రమంలో చిన్నగా వారి మధ్య వివాదాలు మొదలయ్యాయి. అవి కాస్తా పెరిగి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. భరించలేని ఆ భర్త... అక్కడి చేరుకుని భార్యను కిరాతంగా నరికి చంపాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.

husband  killed his wife
భార్యను హతమార్చిన భర్త

By

Published : Aug 1, 2021, 9:52 PM IST

విశాఖ ఏజెన్సీలో దారుణం జరిగింది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీలోని ఉర్లమెట్ట గ్రామంలో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కిరాతకుడు. సొలభం పంచాయతీ పెద్దపొలం గ్రామానికి చెందిన సోమెలి శివప్రసాద్​కు జి.మాడుగుల మండలానికి చెందిన భానుమతి (21)తో గత ఏడాది వివాహం జరిగింది. నెలరోజుల నుంచి దంపతుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని బంధువులు తెలిపారు.

తరచూ జరుగుతున్న గొడవలతో.. భానుమతి ఉర్లమెట్ట గ్రామంలోని తల్లిదుండ్రల ఇంటికి వెళ్లింది. ఆమెపై కక్ష పెంచుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకుని భానుమతిని కిరాతంగా నరకేశాడు. బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అక్కడి నుంచి శివ ప్రసాద్ పరారయ్యాడు. భానుమతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details