ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యతో కలహం.. విశాఖలో హోంగార్డు ఆత్మహత్య - home gaurd

భార్యతో కలహం.. విశాఖ జిల్లాలో ఓ హోంగార్డు ప్రాణం తీసింది. బలవంతంగా ప్రాణం తీసుకునేందుకు పురిగొల్పింది.

'భార్య కొట్టినా ఫిర్యాదు తీసుకోలేదని ఆత్మహత్య '

By

Published : Jul 3, 2019, 3:14 PM IST

'భార్య కొట్టినా ఫిర్యాదు తీసుకోలేదని ఆత్మహత్య '

విశాఖ జిల్లా పోతినమల్లయ్య పాలెం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రకాష్... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విడియో రికార్డు చేసి.. కారణాలు చెప్పాడు. తన భార్యతో పెరిగిన కలహాలే ఆత్మహత్యకు కారణమని వెల్లడించాడు. ఈ మధ్య.. తన భార్య తనపై దాడి చేసిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేదని వీడియోలో చెప్పాడు. ఈ కారణంగానే.. మనస్థాపం చెంది పురుగుల మందు తాగుతుననట్టు వివరించాడు. విషయం తెలుసుకున్న మిత్రులు ప్రకాష్​ను ఆస్పత్రికి తీసుకువెళ్లినా పరిస్థితి విషమించి... మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details