భార్యపై భర్త యాసిడ్ దాడి చేశాడు. అడ్డువచ్చిన కుమార్తెపై యాసిడ్ పడింది. అనంతరం తప్పించుకునేందుకు ప్రయత్నించిన భర్త పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన విశాఖ శివాజీపాలెంలో జరిగింది. ఈ ఘటనలో భార్యతో పాటుగా.. ఆమె 12 ఏళ్ల కూతురు గాయపడింది. అనంతరం భర్త ఈశ్వరరావు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దాడికి పాల్పడినట్లు ఈశ్వరరావు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు బాధితులిద్దరినీ కేజీహెచ్‌కు తరలించారు. బాత్రూంలో వినియోగించే తక్కువ గాఢత కలిగిన యాసిడ్ కావడంతో వీరికి స్వల్ప గాయాలయ్యాయి.
కుటుంబ కలహాలతో.. భార్యపై భర్త యాసిడ్ దాడి - visakha district latest news
విశాఖ జిల్లా శివాజీపాలెంలో ఓ వ్యక్తి.. అతని భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కుమార్తెపైనా యాసిడ్ పడి గాయపడింది.
యాసిడ్ దాడిలో గాయపడిన తల్లీ, కూతురు