విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో చికెన్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 15 రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.50 ఉండగా.. ఇప్పుడు రూ. 250కు చేరుకుంది. గత కొద్ది రోజులుగా కరోనా ప్రభావంతో చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. పౌల్ట్రీ రైతులు బ్రాయిలర్ కోళ్లను అతి తక్కువ ధరలకే విక్రయించారు. ఫలితంగా ఫారాల్లో ఉన్న కోళ్ళు అయిపోయాయి. ఈ పరిణామంతో బ్రాయిలర్ కోళ్ళు దొరకక చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
చికెన్‌కు మళ్లీ డిమాండ్.. పెరిగిన ధరలు - chicken prices today
కరోనా ప్రభావంతో గత కొద్దిరోజులుగా చికెన్ ధరలు పాతాళానికి పడిపోయాయి. కోళ్లను తింటే వైరస్ వ్యాపిస్తుందన్న వదంతులతో ప్రజలు చికెన్ తినడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రాంతాల్లో విక్రయాలు తగ్గిపోయాయి. పౌల్ట్రీ రైతులు తమ ఫారాల్లో ఉన్న కోళ్లను అతి తక్కువ ధరలకే అమ్ముకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చికెన్‌కు డిమాండ్ పెరిగింది. కోళ్ల నిల్వలు తగ్గుతున్న కారణంగా.. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
![చికెన్‌కు మళ్లీ డిమాండ్.. పెరిగిన ధరలు Hugely increased chicken prices](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6883519-497-6883519-1587477786444.jpg)
భారీగా పెరిగిన చికెన్ ధరలు
Last Updated : Apr 22, 2020, 4:07 PM IST