విశాఖ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తరలివెళ్తున్నారు. దీని కోసం విశాఖ ద్వారకా బస్సు కాంప్లెక్స్‌లో ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. మద్దిలపాలెం, వాల్తేర్, గాజువాక డిపోలలో అదనపు బస్సులు అందుబాటులో ఉంచి అప్పటికప్పుడు నడిపే ఏర్పాటు చేశారు. ప్రయాణికులూ ఆర్టీసీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పండగ వేళ రద్దీగా మారిన విశాఖ ద్వారకా బస్సు కాంప్లెక్స్
సంక్రాంతి పండగకు పల్లెలకు వెళ్లే ప్రయాణికులతో విశాఖ బస్టాండ్ రద్దీగా ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక విచారణ కౌంటర్ ఏర్పాటు చేశారు.
విశాఖ నుంచి హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, భీమవరం ప్రాంతాలకు అదనపు బస్సులు వేశారు. విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, నర్సీపట్నం, కాకినాడ, రాజమండ్రి నాన్ స్టాప్ సర్వీసులు నిరంతరం తిప్పుతున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 12 వరకు నాన్ స్టాప్ సర్వీసులు నడుపుతున్నారు. గడిచిన మూడు రోజుల నుంచి ప్రయాణికుల రద్దీ కొనసాగుతోందని, పండగ తర్వాత రోజుల్లో కూడా అదనపు సర్వీసులు కొనసాగుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:సంక్రాంతికి సొంతూరికి పయనం.. కిటకిటలాడుతోన్న రైల్వే, బస్ స్టేషన్లు