లాంగ్‌మార్చ్‌కు విశేష స్పందన ఇసుక కొరత సమస్యను వ్యతిరేకిస్తూ విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు విశేష స్పందన లభించింది. మద్దిలపాలెం నుంచి ప్రారంభమైన ఈ లాంగ్‌మార్చ్‌లో జనసేన కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ జనసైనికులు ర్యాలీలో నినాదాలు చేశారు. జనం భారీగా రావటంతో నడిచే పరిస్థితి లేక ప్రత్యేక వాహనంపై నిలబడి పవన్ ముందుకు సాగారు. జనసేన కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికుల సమూహంతో కలసి జీవీఎంసీ వద్ద ఏర్పాటు చేసిన మహాసభ వద్దకు తరలి వెళ్లారు. ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను పరిష్కరించే వరకు తాము భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని పవన్ స్పష్టం చేశారు.