ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెందుర్తిని విశాఖ జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్ష నేతల భారీ ర్యాలీ - అఖిలపక్ష నేతల భారీ ర్యాలీ

కొత్త జిల్లాల ఏర్పాటుపై.. అభ్యంతరాలు, ఆకాంక్షలు వినిపిస్తూనే ఉన్నాయి. పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖపట్నంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న పెందుర్తిని అనకాపల్లిలో కలపటం సరికాదని అఖిలపక్షం నేతలు హితవు పలికారు.

అఖిలపక్ష నేతల భారీ ర్యాలీ
అఖిలపక్ష నేతల భారీ ర్యాలీ

By

Published : Feb 28, 2022, 8:58 PM IST

పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖపట్నంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ..అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాల వికేంద్రీకరణ పేరుతో ప్రజల ఆక్షాంక్షలను కాలరాయటం సబబు కాదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. పెందుర్తిని విశాఖ జిల్లాలోనే ఉంచాలని 99 శాతం మంది ప్రజల కోరికను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. విశాఖపట్నంతో పెందుర్తికి విడదీయలేని అనుబంధం ఉందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న పెందుర్తిని అనకాపల్లిలో కలపటం సరికాదని హితవు పలికారు.

అనంతరం అఖిలపక్ష సభ్యులు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామిని కలిశారు. పెందుర్తిని విశాఖపట్నంలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేసారు.

ABOUT THE AUTHOR

...view details