విశాఖపట్నం జిల్లా ముంచింగిపుట్టు మండలం గుమ్మసిరగంపుట్టులో ముందస్తు సమాచారంతో పాడేరు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో గుమ్మసిరగంపుట్టులో రవాణాకు సిద్ధంగా ఉంచిన 2,100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంజా తరలిస్తున్న ముగ్గురు నిందితులు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పాడేరులో 2,100 కిలోల గంజాయి స్వాధీనం - vizag district crime
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరులో జరిగింది.
పాడేరులో గంజాయి స్వాధీనం