విశాఖపట్నం జిల్లా చోడవరంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గిరిజన ప్రాంతమైన పాడేరు నుంచి చెన్నైకు కారులో తరలిస్తుండగా... 120 కిలోల సరకు, కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత...నలుగురు అరెస్ట్ - news updates in vizag district
విశాఖపట్నం జిల్లా చోడవరంలో పోలీసులు 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత