విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 140 కిలోల గంజాయిని గుర్తించారు. జిల్లాలోని కోటవురట్ల మండలం చౌడువాడ గ్రామానికి చెందిన కుప్పం అచ్యుతరావు అనే వ్యక్తి.. కారులో గంజాయిని తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. దీని విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని మాకవరపాలెం పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసిన పోలీసులు.. నిందితునికి గంజాయి ఎవరు విక్రయించారు? ఎక్కడ కొనుగోలు చేశారు? తదితర వివరాలను సేకరిస్తున్నారు.
రాచపల్లి జంక్షన్ వద్ద 140 కిలోల గంజాయి పట్టివేత - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా రాచపల్లి జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 140 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాచపల్లి జంక్షన్ వద్ద 140 కిలోల గంజాయి పట్టివేత