చిలకడ దంపల మాటున గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి బిహార్‌కు తరలిస్తుండగా.. 750 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు అరకులోయ సీఐ వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 85 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు.
బిహార్‌కు భారీగా తరలిస్తున్న గంజాయి పట్టివేత - గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు
85 లక్షల రూపాయల విలువైన గంజాయిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా మీదుగా బిహార్‌కు తరలించాలన్న అక్రమార్కుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. వారి యజమానిని అరెస్ట్ చేస్తామని అరకులోయ సీఐ తెలిపారు.
నిందితులతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి
సిబ్బందితో కలిసి ఎస్సై జోగారావు.. వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను పట్టుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. విశాఖ నుంచి ఒడిశాలోని మండికి.. అటుపిమ్మట బిహార్‌కు సరుకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల యజమాని సోను కుమార్ ఠాకూర్‌ను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఆన్లైన్ యాప్‌ల్లో రుణం... ఒత్తిడి తట్టుకోలేక యువతి ఆత్మహత్య