ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భారీగా గంజాయి పట్టివేత - బీఎస్​ఎఫ్, పోలీసులు ఏవోబీలో పట్టుకున్న గంజాయి

భారీ గంజాయి అక్రమ రవాణాను బీఎస్ఎఫ్​తో కలిసి మాచ్​ఖండ్ పోలీసులు భగ్నం చేశారు. 85 లక్షల రూపాయల విలువైన సరుకుతో పాటు నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​డీపీవో సంజయ్ కుమార్ మొహాపాత్రో తెలిపారు.

huge ganja load caught
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి లోడు

By

Published : Nov 4, 2020, 10:36 PM IST

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మాచ్​ఖండ్ పోలీసులు, 15వ బెటాలియన్ సరిహద్దు భద్రతా బలగాలు సంయుక్తంగా భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు. బొలెరో పికప్ వాహనంలో 169 ప్యాకెట్ల గంజాయిని గుర్తించినట్లు.. నందపూర్ ఎస్​డీపీవో సంజయ్ కుమార్ మొహాపాత్రో తెలిపారు. పట్టుకున్న సరకు విలువ అంతర్జాతీయ మార్కెట్​లో 85 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.

హనుమాల్ గ్రామ సమీపంలో తనిఖీలు చేస్తున్నప్పుడు.. ఈ సరకు పట్టుకున్నామని సంజయ్ వెల్లడించారు. నాటు తుపాకీతో పాటు రెండు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. పోలీసులను చూసి వాహనంలోని ఇద్దరు పారిపోయారని వివరించారు. దశల వారీగా గంజాయి పంటలను ధ్వంసం చేస్తామని తెలిపారు. గంజాయి వ్యాపారులను గుర్తించి.. వారి బ్యాంక్ లావాదేవీలపై నిఘా పెంచుతామన్నారు.

ఇదీ చదవండి:అక్రమార్కులపై చర్యలు తప్పవు: జిల్లా రిజిస్ట్రార్‌ మన్మధరావు

ABOUT THE AUTHOR

...view details