విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరులో గనులు శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సమెంట్ రెండు క్వారీలకు రూ.20.85 కోట్ల జరిమానా విధించారు. గ్రామంలోని సర్వేనెంబర్ 1లో ఉన్న క్వారీలో నిబంధనలు అతిక్రమించారనే కారణంగా రూ.16.4 కోట్ల జరిమానా విధించినట్లు ఏడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. మరో సర్వేనెంబర్ 220లో ఉన్న క్వారీలో సైతం నియమాలు పాటించకపోవడం వల్ల రూ.4.81 కోట్లు అపరాధ రుసుం విధించామన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని క్వారీలపై కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమించిన క్వారీలపై రూ.20.85 కోట్ల భారీ జరిమానా - విశాఖ జిల్లాలో రెండు క్వారీలకు భారీ జరిమాన
నిబంధనలను అతిక్రమించిన రెండు క్వారీలపై అధికారులు రూ.20.85 కోట్ల జరిమానా విధించారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరులో ప్రభుత్వ నియమాలు పాటించని క్వారీలను అధికారులు గుర్తించారు. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్వారీలకు భారీ జరిమాన