విశాఖ మన్యంలో భారీ మొసలి కళేబరం కనిపించింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు వాగులో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఆ కళేబరాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారు. ఇది సుమారు 12 అడుగుల పొడవుతోపాటు భారీ దేహంతో ఉంది. ఆ కళేబరాన్ని చూసేందుకు స్థానిక గిరిజనులు ఎగబడ్డారు. అయితే.. కళేబరం నుంచి దుర్వాసన వస్తుండటంతో వారు.. దీన్ని సమీపంలోనే పూడ్చిపెట్టారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న చెరువూరు వాగుపై వంతెనలు లేకపోవడంతో వాగులు దాటుకుంటూ స్థానికులు గ్రామాలకు చేరుకుంటుంటారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వాగులో నీరు తాగేందుకు వెళ్లిన కొందరు గిరిజనులు.. ఈ ముసలిని గుర్తించారు. ఏమైందో తెలియదుగానీ.. వాగు ఒడ్డున అది చనిపోయి ఉంది.