భారీగా గంజాయి పట్టివేత... వ్యక్తి అరెస్టు - విశాఖ జిల్లా నేర వార్తలు
భారీగా గంజాయి పట్టివేత
16:03 August 26
245 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం జిల్లాలోని మన్యం నుంచి భారీగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో గరికబంధ చెక్పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 245కిలోల గంజాయిని పట్టుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఒకరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ సరకు విలువ రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీచదవండి.
Vijayasaireddy: విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి
Last Updated : Aug 26, 2021, 10:19 PM IST