విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో సీఎస్ఆర్ బ్లాక్ అభివృద్ధికి మరో 3 కోట్ల రూపాయల వితరణకు హెచ్‌పీసీఎల్ విశాఖ రెఫైనరీ ముందుకు వచ్చింది. గతంలో ఈ సంస్థ రెండు కోట్ల రూపాయలను ఆ బ్లాక్ నిర్మాణం కోసం ఇచ్చింది.
సీఎస్ఆర్ బ్లాక్ అభివృద్ధికి మరో రూ. 3 కోట్ల వితరణ - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి సీఎస్ఆర్ బ్లాక్ అభివృద్ధికి.. ఎచ్పీసీఎల్ మరో 3 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఆసుపత్రి, హెచ్‌పీసీఎల్ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.
![సీఎస్ఆర్ బ్లాక్ అభివృద్ధికి మరో రూ. 3 కోట్ల వితరణ visakha king jeorge hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:23:39:1599209619-ap-vsp-05-04-kgh-csr-block-funds-release-av-3031531-04092020093929-0409f-1599192569-531.jpg)
ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న అధికారులు
జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, హెచ్‌పీసీఎల్ ఈడీ రతన్‌రాజు సమక్షంలో… హెచ్‌పీసీఎల్, కేజీహెచ్ ఉన్నతాధికారులు రాజారావు, డాక్టర్ పీ.వి సుధాకర్.. తాజా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. రూ.3 కోట్లతో త్వరలోనే సీఎస్ఆర్ బ్లాక్‌ను అభివృద్ధి చేయనున్నారు.