ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 9, 2020, 1:05 AM IST

ETV Bharat / state

'లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఎలా అనుమతించింది?'

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారులోని... లేటరైట్ ప్రభావిత ప్రాంతాలను సీపీఎం నాయకులు సందర్శించారు. గిరిజనుల జీవన విధానంపై చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏ విధంగా అనుమతులిచ్చిందని ప్రశ్నించారు.

How the government allowed laterite excavations -CPM
లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఎలా అనుమతించింది –సిపిఎం

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో సీపీఎం నేతలు పర్యటించారు. లేటరైట్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆసనగిరి, దద్దుగుల తదితర గిరిజన గ్రామాలను సందర్శించి గిరిజనులతో సమావేశమయ్యారు. ఎలాంటి చర్చ చేయకుండా లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఏవిధంగా అనుమతులు మంజూరు చేసిందని.. అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. గిరిజనుల అభిప్రాయాలను సేకరించకుండా అనుమతులు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details