పట్టణాల్లోని మధ్య తరగతికి తక్కువ ధరకు.. ప్రభుత్వం అందించనున్న ఇళ్ల స్థలాల కోసం 3,79,147 కుటుంబాలు ఆసక్తి చూపాయి. ఇందుకోసం వార్డు సచివాలయాల్లో సిబ్బంది నిర్వహించిన డిమాండు సర్వే మంగళవారంతో ముగిసింది. 150 చదరపు గజాల్లో స్థలాలకు 1,19,845 కుటుంబాలు, 200 చ.గ. స్థలాలకు 1,31,233, 240 చ.గ. స్థలాలకు 1,28,069 కుటుంబాలు ఆసక్తి కనబరిచినట్లు అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా 46,675 కుటుంబాలు ముందుకొచ్చాయి. భూ సేకరణకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు వివరించారు.
ఇళ్ల స్థలాలకు 3.79 లక్షల కుటుంబాల ఆసక్తి
పట్టణాల్లో ఉండే మధ్యతరగతి వారికి సొంతిల్లు ఒక కల. సంపాదించే దాంట్లో సింహా భాగం ఇంటి అద్దెలు చెల్లించటానికే సరిపోతుంది. మిగిలిన కొద్దిమెుత్తంతో కుటుంబాన్ని నెట్టుకు రావటం.. ఈఎంఐలు... కరెంటు బిల్లులు.. మెుబైల్ బిల్లులు కట్టేందుకు సరిపోతుంది. నెలాఖరున ఇల్లు గడవటం కోసం చేబదులు తీసుకోవటం పరిపాటిగా జరుగుతుంది. అదే సొంతిల్లు అంటే.. అద్దే కట్టే మెుత్తాన్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. వీరి బాధలను గమనించిన ప్రభుత్వం... పట్టణాల్లో ఉండే మధ్య తరగతి వారికి తక్కువ ధరకే.. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం వార్డు సచివాలయాల్లో డిమాండ్ సర్వే నిర్వహించింది.
ఇళ్ల స్థలాలు