ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో కూలీ మృతి - విశాఖలో ఇంటి నిర్మాణ కూలీల మృతుల వార్తలు

ఇంటి నిర్మాణం పనులు చేస్తోన్న ఓ కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా జోగింపేటలో జరిగింది.

labour died of electric shock
విద్యుదాఘాతంతో మృతి చెందిన కూలీ

By

Published : Jun 13, 2020, 12:00 PM IST

విశాఖ జిల్లా గొలుగొండ మండలం జోగింపేటలో విద్యుదాఘాతంతో అచ్చియ్యనాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని సాలికమల్లవారం గ్రామానికి చెందిన ఆయన... జోగింపేటలో ఇంటి నిర్మాణంలో కూలీ పనికి వెళ్లాడు. పనులు చేస్తోన్న సమయంలో ఇంటిపై విద్యుత్తు తీగలు అతనికి తగిలాయి. వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్న కొద్దిసేపటికే అచ్చియ్యనాయుడు మృతి చెందాడు. గొలుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details