ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెరుచుకోనున్న హోటళ్లు... ఆనందంలో యజమానులు - విశాఖలో హోటళ్లు వార్తలు

జూన్ 8నుంచి విశాఖ జిల్లాలో హోటళ్లు తెరచుకోనుండటంతో... విశాఖ హోటల్ మర్చెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నియమాలకు అనుగుణంగా తిరిగి నడిచే హోటళ్లకు... ప్రజలు నిర్భయంగా రావాలని కోరుతున్న రాష్ట్ర హోటల్ మర్చంట్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి సత్యనారాయణతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

hotels reopening after lockdown in vishakapatnam
లాక్​డౌన్ అనంతరం విశాఖలో తెరుచుకోనున్న హోటళ్లు

By

Published : Jun 5, 2020, 1:16 PM IST

లాక్​డౌన్​ అనంతరం కొన్ని సడలింపులతో విశాఖ జిల్లాలో హోటళ్లు తెరచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచి హోటళ్లు తెరచి వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో... విశాఖ హోటల్ మర్చెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు రెండు వేల హోటళ్లు తెరచుకోనున్నాయి.

కరోనా వ్యాప్తి నివారణ నియమాలు, నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ హోటల్స్ నడుపుతామని యజమానులు చెబుతున్నారు. ఇంతకుముందులా హోటల్ కి వచ్చే వినియోగదారులు సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా... తిరిగి వ్యాపార నిర్వహణ వల్ల చాల మంది జీవనోపాధికి లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details