విశాఖపట్నం జిల్లా చోడవరంలో కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలవుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపారాలకు అనుమతి ఉండటంతో.. భోజనశాలల నిర్వాహకులు గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఒక భోజనశాల ద్వారా మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. కేవలం పార్శిళ్ల ద్వారానే వినియోగదారులకు సేవలందిస్తున్నారు. ఫలితంగా సరైన వ్యాపారం లేక కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Corona effect: కర్ఫ్యూ ప్రభావం.. హోటళ్లలో తగ్గిన గిరాకీలు
కరోనా మహమ్మారి అన్ని వర్గాల వారిని కోలుకోలేని దెబ్బతీసింది. వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పాటిస్తున్న కర్ఫ్యూతో వ్యాపారాలు సన్నగిల్లాయి. ముఖ్యంగా హోటళ్ల పరిస్థితి(భోజన శాలలు) మరీ దారుణంగా తయారైంది. మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరుస్తుండటంతో.. అమ్మకాలు జరగక హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హోటళ్లలో తగ్గిన గిరాకీలు