లాక్‌డౌన్ కాలంలో హాస్టల్ బిల్డింగ్ అద్దెలు పూర్తిగా చెల్లించలేమని 50 శాతం అద్దెలు మాత్రం తీసుకునే విధంగా బిల్డింగ్ ఓనర్స్‌ని ఒప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశాఖ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత దీక్ష చేపట్టారు. తాళం వేసి ఉన్న హాస్టల్స్‌కి వేలల్లో కరెంట్ బిల్స్ వచ్చాయని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులని తక్షణమే మాఫీ చేయాలన్నారు. ఈ దీక్షలో అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ దుర్గారావు, ట్రెజరర్ రమేష్, జాయింట్ ట్రెజరర్ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ శాంతియుత దీక్ష - Peaceful Initiation latest news
విశాఖ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత దీక్ష చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన వారు హాస్టల్స్‌ను చిన్న తరహ పరిశ్రమలుగా గుర్తించి బ్యాంకులు తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ శాంతియుత దీక్ష