ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దక్షిణ భారతదేశం రానున్న రోజులో ఆర్థికంగా మరింత అభివృద్ధి అవుతుంది: కంచి కామకోటి పీఠాధిపతి - విజయేంద్ర సరస్వతికి పౌర సన్మానం

KANCHI KAMAKOTI PEETAM : విశాఖ నగరానికి, ఆంధ్ర రాష్టానికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అన్నారు. విశాఖపట్నం బీచ్‌ రోడ్డులోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో విజయేంద్ర సరస్వతికి.. పౌర సన్మానం చేశారు.

kanchi kamakoti
kanchi kamakoti

By

Published : Feb 22, 2023, 10:32 AM IST

KANCHI KAMAKOTI PEETAM : దక్షిణ భారతదేశం రానున్న రోజులో ఆర్థికంగా మరింత అభివృద్ధి అవుతుందని కంచి కామకోటి పీఠాధిపతి.. విజయేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ నగరానికి, ఆంధ్ర రాష్టానికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయన్నారు. ఆధ్యాత్మిక చింతన, ధర్మ నిరతి మనుషులను మహోన్నత స్థానానికి తీసుకుని వెళ్తాయని ఆయన అన్నారు. విశాఖపట్నం బీచ్‌ రోడ్డులోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో విజయేంద్ర సరస్వతికి.. పౌర సన్మానం చేశారు. ఆధ్యాత్మిక చింతన, ధర్మ నిరతి మనుషులను.. మహోన్నత స్థానానికి తీసుకుని వెళ్తాయని విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి రోజు తనని కలుసుకున్న అనేక రంగాలకు చెందిన ప్రముఖులు, భక్తులకు శుభాభినందనలు తెలిపారు.

"దక్షిణ భారతదేశం రానున్న రోజులో ఆర్థికంగా మరింత అభివృద్ధి అవుతుంది. విశాఖ నగరానికి, ఆంధ్ర రాష్టానికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి"-విజయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠాధిపతి

సనాతన ధర్మ పరిరక్షణకు కంచికామకోటి పీఠం కృషి:కంచి కామకోటి పీఠం సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోందని.. దానికి అనుగుణంగా అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. కంచి కామకోటిపీఠం అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు.

"భవిష్యత్తులో నా జీవితం గురించి మాట్లాడుకునే అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి స్వామి వారితో గడిపిన రెండు గంటల సమయం. ఈ జన్మకే కాదు జన్మజన్మలకూ ఆ అనుభవాన్ని నేను మర్చిపోను"-జస్టిస్ సోమయాజులు,హైకోర్టు న్యాయమూర్తి

స్వామీజీ ఆశీస్సులు రాష్ట్రానికి అవసరం : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. శంకర విజయేంద్ర సరస్వతి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారని.. స్వామీజీ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వి. సోమయాజులు, రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆర్.కె.బీచ్ కాళీమాత ఆలయం ఆవరణలో భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details