విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మెరైన్ పోలీసు స్టేషన్లో.. ఏడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న హోం గార్డ్ బొడ్డు అప్పన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి పదేళ్ల కిందట వివాహం కాగా.. భార్య గొడవపడి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ కారణంతో మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన తల్లికి ఉత్తరం రాసి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్యాభర్తల మధ్య గొడవ.. మనస్థాపంతో హోంగార్డ్ ఆత్మహత్య - మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డ పూడిమడక మెరైన్ స్టేషన్ హోంగార్డ్
భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోగా.. మనస్థాపం చెందిన మెరైన్ పోలీసు స్టేషన్ హోం గార్డ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు తన తల్లికి లేఖ రాసి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.
పూడిమడకలో హోంగార్డు ఆత్మహత్య