ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్.. చోడవరం ప్రభుత్వ కార్యాలయాల్లో తగ్గిన సిబ్బంది - చోడవరం రిజిస్టర్ కార్యాలయం

రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా రావటంతో విశాఖ జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సెలవులు ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

holidays to registrar office in chodavaram vizag district
చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆగస్టు 2 వరకు సెలవులు

By

Published : Jul 27, 2020, 6:59 PM IST

Updated : Jul 27, 2020, 9:13 PM IST

కరోనా ప్రభావం విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ కార్యాలయాలపై పడింది. అక్కడ విధులు నిర్వహిస్తోన్న సిబ్బందికి కొవిడ్ లక్షణాలు బయటపడుతుండటంతో కార్యాలయాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా దస్తావేజు లేఖరికి కరోనా సోకటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సోమవారం నుంచి ఆగస్టు 2 వరకు మూసివేస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. రెవెన్యూ కార్యాలయంలోనూ ఓ ఉద్యోగికి కొవిడ్ లక్షణాలు కనిపించడంతో కార్యాలయానికి ఎవరూ రావద్దని చోడవరం తహసీల్దార్ రవికుమార్ నోటీస్​లో పేర్కొన్నారు.

న్యాయ స్థానాల్లో పనిచేసే సిబ్బందిలో ఎనిమిది మందికి వైరస్ సోకటంతో కార్యకలాపాలు నిలిపివేశారు. పోలీసు స్టేషన్​లో ఇద్దరు పోలీసులు, హోమ్ గార్డుకు కరోనా సోకింది. దీనికి తోడు వృద్ధులైన ముగ్గురు సిబ్బందిని ఇంటికే పరిమితం చేశారు. కరోనా పాజిటివ్​ లక్షణాలు కలిగిన సిబ్బందితో సన్నిహితంగా ఉన్న ఐదుగురు హోం క్వారంటైన్​లో ఉన్నారు. ఇలా కరోనా దెబ్బతో... సిబ్బంది లేక పనులు సాగక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి.

Last Updated : Jul 27, 2020, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details