ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ బాధితుల కోసం.. హెచ్​పీసీఎల్ భారీ విరాళం - visakha hpcl latest news update

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ రిఫైనరీ... కొవిడ్ బాధితుల కోసం భారీ విరాళం ఇచ్చింది. చెక్కును జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్​కు హెచ్​పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రత్నరాజ్ అందజేశారు.

Hindustan Petroleum Corporation Limited
కొవిడ్ బాధితుల కోసం హెచ్​పీసీఎల్ భారీ విరాళం

By

Published : May 20, 2021, 12:09 PM IST

విశాఖ జిల్లాలో కొవిడ్ బాధితుల చికిత్స కోసం.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ రిఫైనరీ విరాళం అందించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా కోసం రూ.35 లక్షల మొత్తాన్ని ఇచ్చింది.

హెచ్​పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.రత్నరాజ్.. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును కలెక్టర్ వి.వినయ్ చంద్​కు అందజేశారు. దేశంలో పెరుగుతున్న కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కోసం హెచ్​పీసీఎల్ సామాజిక బాధ్యతగా ఈ రకమైన విరాళాలు అందిస్తోందని రత్నరాజ్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details