కరోనా కష్టకాలంలో విశాఖలో దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత స్థితిలో ఉన్నవారు కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఇదే కోవలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, విశాఖ రిఫైనరీ.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం రూ. 35 లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది. చెక్కును జిల్లా కలెక్టర్ వినయ చంద్‌కు అందజేశారు. ఆక్సిజన్ అందక బాధితులు మరణిస్తుండటంతో.. ఈ విరాళాలు ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కరోనా రోగులకు హిందుస్తాన్ పెట్రోలియం, విశాఖ రిఫైనరీ సహాయం - కరోనా రోగులకు విశాఖ రిఫైనరీ సహాయం వార్తలు
కరోనా బాధితులకు సాయం చేయటం కోసం.. విశాఖలో పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, విశాఖ రిఫైనరీ సంస్థలు.. జిల్లా కలెక్టరకు రూ.35లక్షల విరాళాన్ని అందించాయి.
help for covid victims