ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మరింత అభివృద్ధి చెందాలి: హిమాచల్​ గవర్నర్ బండారు

హిమాచల్ ​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భాజపా సీనియర్ నేత పీవీ చలపతిరావును కలుసుకున్నారు. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశానికి చెందిన భారత్​ బయోటెక్ కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టటం యావత్ భారత్​ దేశం అభినందించాలని అన్నారు.

dattatreya in vizag
విశాఖపట్నం పర్యటనలో హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ

By

Published : Jan 7, 2021, 9:42 AM IST

విశాఖ మరింత అభివృద్ధి చెందాలని హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనకు.. విమానాశ్రయంలో ఎమ్మెల్సీ మాధవ్, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

విశాఖపట్నం పర్యటనలో హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ

విమానాశ్రయం నుంచి నేరుగా పాత సీబీఐ కూడలి మూడోపట్టణ పోలీస్​ స్టేషన్ సమీపంలో ఉంటున్న.. ఏయూ విశ్రాంత ఆచార్యురాలు సీహెచ్ శాంతమ్మను గవర్నర్ దత్తాత్రేయ కలిశారు. ఆమె ఆరోగ్యం, యోగక్షేమాలపై ఆరా తీశారు.

గురువుకు పాదభివందనం

అనంతరం భాజపా సీనియర్ నేత పీవీ చలపతిరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చలపతిరావుకు దత్తాత్రేయ పాదాభివందనం చేయగా.. ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. చలపతిరావు కుటుంబసభ్యులతో కలిసి దత్తాత్రేయ భోజనం చేశారు. గతంలో వీరిద్దరూ పలు పార్టీ పదవుల్లో కలిసి పనిచేశారు. చలపతిరావును దత్తాత్రేయ తన గురువుగా భావిస్తారు.

తెలుగువారి కంపెనీ భారత్ బయోటెక్ నుంచి కరోనా వ్యాక్సిన్ రావటం మనకు గర్వకారణం. 2020 కరోనాపై విజయం సాధించిన సంవత్సరం. వ్యాక్సిన్​కు కృషి చేసిన భారత్ బయోటెక్​ను అందరూ అభినందించాలి- బండారు దత్తాత్రేయ

ఇదీ చదవండి:

మంత్రి అవంతి కాన్వాయ్​ అడ్డగింత

ABOUT THE AUTHOR

...view details