HILL DROPPED: విశాఖ జిల్లా పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. రాయి తవ్వకాల్లో ఒక్కసారిగా కొండ ఒడ్డుకు జారింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొన్నేళ్లుగా అక్కడ క్వారీయింగ్ జరుగుతూ వస్తోంది. వాస్తవంగా తీసుకున్న అనుమతులు ఒకటైతే, క్వారీయింగ్ దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో యజమానికి అధికారులు జరిమానా సైతం కూడా విధించారు. స్థానికుల అందోళనతో క్వారీయింగ్ కొంతకాలం నిలిపివేసిన అధికారులు.. ఆ తర్వాత మళ్లీ అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం హఠాత్తుగా పెద్ద ఎత్తున కొండ చరియలు జారిపడ్డాయి.
Live Video: కూలిపోయిన కొండ.. ఎక్కడో తెలుసా..! - విశాఖ జిల్లా తాజా వార్తలు
Hill Dropped: ఓ క్వారీలో కొండ కూలింది. కొండ కూలడమేంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదవండి.
ఒక్కసారిగా ఒడ్డుకు జారీన కొెండ
విషయం తెలుసుకున్న పెందుర్తి తహశీల్దార్ బాబ్జీ క్వారీని పరిశీలించారు. తవ్వకాలకు ఎంతవరకు అనుమతి ఉందో.. లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. దీనిని తొలగించే వరకు రాకపోకలు నిలుపుదల చేస్తున్నామన్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Jun 2, 2022, 8:50 PM IST