ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బండరాళ్లు రోడ్డు పైకి దొర్లినా.. పట్టించుకోరా? - ap latest

భారీ వర్షాలకు రోడ్డుపై కూలిన బండరాళ్ల వల్ల విశాఖపట్నం జిల్లాలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజులైనా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

బండరాళ్లు రోడ్డు పైకి దొర్లిన పట్టించుకోవటం లేదు!

By

Published : Aug 1, 2019, 11:24 PM IST

రోడ్డు పైకి దొర్లిన బండరాళ్లు..పట్టించుకోని అధికారులు

విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగడ - డుడుమా జలపాతం రోడ్డుపై బండరాళ్లు దొర్లి రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ఈ దారి నుంచే ప్రజలు పనస, గతురుముండా, దొరగుడా, ఒనకడిల్లి, మాచకుండ్, లమతపుట్టు గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. విద్యార్థులు రోజు 2కిలోమీటర్లు నడుచుకుంటూ సంగడ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details