ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ డ్రైవర్లకు బిర్యానీ పంపిణీ చేసిన హిజ్రాలు - Hijras distributed biryani packets to lorry drivers

లాక్​డౌన్ కారణంగా... లారీ డ్రైవర్లకు తిండి కరువైంది. వారి ఇబ్బందులను చూసి చలించిన హిజ్రాలు బిర్యానీ ప్యాకెట్ల్ పంపిణీ చేసి డ్రైవర్ల ఆకలి తీర్చారు.

Hijras distributed biryani packets to lorry drivers
లారీ డ్రైవర్​లకు హిజ్రాలు బిర్యానీ పంపిణీ

By

Published : Apr 4, 2020, 9:44 AM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి సర్కిల్ పరిధిలోని జాతీయ రహదారిపై నిలిచిపోయిన లారీ డ్రైవర్​లకు హిజ్రాలు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్ ప్రకటించగా... దూరప్రాంతాలకు వెళ్లే లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాలు పెట్రోల్ బంకులు వద్ద వీటిని నిలిపివేశారు. హోటళ్లు మూసివేయడంతో వీరికి తిండి కరువైంది. లారీ డ్రైవర్ల కష్టాలు అర్థం చేసుకున్న హిజ్రాలు సొంతంగా బిర్యానీ తయారు చేసి పోలీసుల సాయంతో వారికి పంపిణీ చేశారు. హిజ్రాల చేపట్టిన ఈ మంచిపని అందరినీ ఆకట్టుకుంది. స్థానిక సీఐ నారాయణ రావు వీరిని అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details