ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చింతపల్లిలో అక్రమ నిర్మాణాల తొలగింపు... ఉద్రిక్తత - Demolition of illegal structures in vishakha chintapalli

విశాఖ జిల్లా చింతపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో దుకాణాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిన రెవిన్యూ అధికారులకు... నిరసన సెగ తగిలింది.

hightension in vishakha chintapalli on  Demolition of illegal structures
చింతపల్లిలో అక్రమనిర్మాణాలు తొలగింపు...ఉద్రిక్తత

By

Published : Dec 16, 2019, 10:10 PM IST

చింతపల్లిలో అక్రమనిర్మాణాలు తొలగింపు...ఉద్రిక్తత

విశాఖ జిల్లా పాడేరు సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాలు మేరకు చింతపల్లి మండల కేంద్రంలో.. అక్రమ నిర్మాణాల తొలగింపును రెవిన్యూ అధికారులు ప్రారంభించారు. ఇందులో భాగంగా రెవిన్యూ, ఆర్‌అండ్‌బీ, పట్టు పరిశ్రమ కార్యాలయాలు, ఆసుపత్రి వద్ద అక్రమంగా ఏర్పాటుచేసిన దుకాణాలను ఈనెల 15 లోగా తొలగించాలని రెవిన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. గడువు ముగిసినప్పటికీ వ్యాపారులు ముందుకు రాని కారణంగా దుకాణాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు.

ఇది అన్యాయం...

ఏళ్ల తరబడి ఉంటున్న తమను అధికారులు ఖాళీ చేయించడం తగదని, గిరిజన ప్రాంతంలో గిరిజనులకు నిలువనీడ లేకుండా చేయటం అన్యాయమని దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలను నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు, వ్యాపారస్థులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తన నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించాలంటూ గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మరో బృందం పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించిన కారణంగా.. తీవ్ర ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను నిలువరించడానికి ప్రయత్నం చేసినా ఫలించలేదు. చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్‌ రంగప్రవేశం చేసి ఇరువర్గాల...ఆందోళనకారులను పిలిపించి చర్చలు జరిపారు.

ఇవీ చూడండి

బాలికపై అత్యాచారం బాధాకరం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details