విశాఖపట్నం డాబా గార్డెన్స్‌లోని మహాత్మా గాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు వైశాఖి జల ఉద్యానవనంలో కలిశారు. 1947లో ఏర్పాటైన ఈ పాఠశాలలో దశాబ్దాల క్రితం చదువుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా కలుసుకున్నారు. వారి గత స్మృతులను నెమరవేసుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుత శాసన మండలి సభ్యుడు పప్పల చలపతిరావు సమావేశానికి హాజరయ్యారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనాటి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు.
ఆనందోత్సాహాలతో.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం - latest vizag dabagardens news
దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న వారంతా ఒకచోట చేరారు. ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు కూడా ఉన్నారు.

నగరపాలక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నగరపాలక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Last Updated : Oct 28, 2019, 8:29 AM IST